ఏపీ: ఏపీలో నిరుద్యోగ భృతి విధివిధానాలపై మంత్రుల సమీక్ష

  • నిరుద్యోగుల సంఖ్యను తేల్చేందుకు సమాచారం సేకరించాం
  • ‘ఆధార్’ ఆధారంగా నిరుద్యోగ భృతి దరఖాస్తులు
  • ఈ పథకం వర్తించని దరఖాస్తుదారులకు ఆన్ లైన్ లో కారణాలు తెలపాలని లోకేశ్ సూచన

ఏపీలో త్వరలో అమలు చేయనున్న నిరుద్యోగ భృతి విధివిధానాలపై మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, నిరుద్యోగుల సంఖ్యను తేల్చేందుకు సమాచారం సేకరించామని, సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చేలోగా ఈ పథకం అమలుకు ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. వయసు, విద్యార్హత, ఆర్థిక పరిస్థితి ఆధారంగా నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆధార్ కార్డు ఆధారంగా నిరుద్యోగ భృతి దరఖాస్తు ఫారాలు తీసుకోవాలని, ఈ పథకం వర్తించని దరఖాస్తుదారులకు ఆన్ లైన్ లో కారణాలు తెలపాలని సంబంధిత అధికారులకు లోకేశ్ సూచించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఈ పథకం అమలు తీరుపై చర్చించారు.

  • Loading...

More Telugu News