తాజ్ మహల్: హిందూ దేవాలయాన్ని కూల్చి తాజ్ మహల్ కట్టారు: ఎంపీ వినయ్ కతియార్

  • తాజ్ మహల్ ఒకప్పుడు శివాలయం
  • ‘తేజోమహాలయ్’ అని పిలిచేవారు
  • షాజహాన్ దానిని కూల్చేశాడు
  • ఓ ఇంటర్వ్యూలో వినయ్ కతియార్ 

చారిత్రక కట్టడం తాజ్ మహల్ పై బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఇదే విషయమై, బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాజ్ మహల్ ఒప్పుడు హిందూ దేవాలయం.. శివాలయమని, ‘తేజోమహాలయ్’ అని పిలిచేవారని అన్నారు. ఆ ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ కూల్చేసి, తాజ్ మహల్ ను నిర్మించిన విషయం వాస్తవమని, అయితే, దానిని కూల్చేయాలని తానేమి అడగట్లేదని అన్నారు. కాగా, అయోధ్యలోని రామమందిరం విషయంలోనూ కతియార్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News