revanth reddy: ఢిల్లీలో చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరలేదు: రేవంత్ రెడ్డి

  • మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం
  • చంద్రబాబు విదేశాల నుంచి వచ్చిన తర్వాత కలుస్తా
  • ఇరు రాష్ట్రాల్లో వేడి పుట్టిస్తున్న రేవంత్
ఢిల్లీలో ఉన్నప్పుడు తాను చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ కోరలేదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. విదేశాల నుంచి చంద్రబాబు తిరిగొచ్చాక... ఆయనను కలుస్తానని చెప్పారు. మరోవైపు, ఈరోజు మీడియాతో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. తెలుగుదేశం ఏపీ నేతల వ్యవహారశైలిపైన, కేసీఆర్ కు- ఏపీ నేతలకు మధ్య ఉన్న సంబంధాలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు వేడిని పుట్టిస్తున్నాయి.
revanth reddy
tTelugudesam
congress
revanth reddy
congress
chandrababu
ap cm

More Telugu News