బెల్లం కొండ శ్రీనివాస్: బెల్లంకొండ శ్రీనివాస్ 'సాక్ష్యం' సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

  • శ్రీవాస్ దర్శకత్వంలో నటిస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్
  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కుతున్న సినిమా
  • 'సాక్ష్యం' టైటిల్ ను ఖరారు చేసిన సినీ యూనిట్

బోయపాటి దర్శకత్వంలో తాను న‌టించిన ‘జయ జానకి నాయకా’ చిత్రం విజయవంతం కావడంతో మంచి హుషారు మీద ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్.. ప్ర‌స్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ  సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను ఈ రోజు ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.

దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌పై సినిమా యూనిట్‌ స్ప‌ష్ట‌త నిచ్చింది. ఈ సినిమాకు 'సాక్ష్యం' అన్న టైటిల్ ను  ఖరారు చేశారు. అభిషేక్ నామా నిర్మిస్తోన్న‌ ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. ఈ సినిమా పేరుకు తగ్గట్లుగానే ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ ఉంది. 

  • Loading...

More Telugu News