sangeeth som: ఆ ఎమ్మెల్యేకు ఆరో తరగతి పుస్తకాన్ని ఇచ్చి.. చరిత్రను చదివించండి: బాలీవుడ్ రచయిత జావెద్ అఖ్తర్

  • సంగీత్ సోమ్ కు చరిత్ర కూడా తెలియదు
  • జహంగీర్ కాలంలో భారతీయుల జీవన ప్రమాణాలు బాగున్నాయి
  • ఈ విషయాన్ని థామస్ రోయి పేర్కొన్నారు
తాజ్ మహల్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ పై బాలీవుడ్ రచయిత జావెద్ అఖ్తర్ విరుచుకుపడ్డారు. తాజ్ మహల్ ను భారతీయ సంస్కృతికి మచ్చగా సోమ్ అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమ్ కు భారత చరిత్ర తెలియకపోవడాన్ని కూడా మనం గొప్ప విషయంగా భావించాలని... 'ఎవరైనా ఆయనకు ఆరో తరగతి పుస్తకాన్ని ఇచ్చి, ఆయనతో చరిత్రను చదివించండి' అంటూ ఎద్దేవా చేశారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో భారత్ కు వచ్చిన థామస్ రోయి... ఆంగ్లేయుల కంటే భారతీయుల జీవన ప్రమాణాలే మెరుగ్గా ఉన్నాయని తన పుస్తకంలో రాశారని చెప్పారు.
sangeeth som
jahangir
taj mahal

More Telugu News