పెద్ద క్రేన్ విరిగి కారు మీద పడింది... అయినా డ్రైవర్‌కి ఏం కాలేదు... వీడియో చూడండి!
- నుజ్జునుజ్జయిన ఆడీ కారు
- కారు కప్పు మీద నుంచి బయటపడ్డ వ్యక్తి
- కంగుతిన్న ఇతర వాహనచోదకులు
దాంతో డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి పరిస్థితి కూడా అలాగే అయ్యుంటుందని అందరూ అనుకున్నారు. కానీ కారు పైకప్పు నుంచి 29 ఏళ్ల వయసున్న వ్యక్తి క్షేమంగా బయటకు రావడం చూసి ఆశ్చర్యపోయారు. క్రేన్ విరిగిపడే సమయానికి కారు దాని కిందకి రావడం దురదృష్టమైతే... ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడటం అదృష్టమని అందరూ అంటున్నారు. అయితే తనకు మోకాలి మీద చిన్న గాయం అయిందని, క్రేన్ విరిగి పడినపుడు చాలా భయం వేసిందని డ్రైవర్ చెప్పుకొచ్చాడు.