అనిరుథ్: ఆయన్ని ‘గురూజీ’ అని సంబోధిస్తా!: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్
- తెలుగు సినిమాకు సంగీతం అందించాలనే కోరిక త్రివిక్రమ్ ద్వారా నెరవేరుతోంది
- ఆయన నాకు పెద్దన్నయ్య లాంటి వారు
- ఓ ఇంటర్వ్యూలో అనిరుథ్
తెలుగు సినిమాకు సంగీతం అందించాలనే తన కోరిక దర్శకుడు త్రివిక్రమ్ ద్వారా నెరవేరుతోందని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, త్రివిక్రమ్ నుంచి తనకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని, ఆయన తనకు పెద్దన్నయ్య లాంటి వారంటూ తన ప్రేమను వ్యక్త పరిచాడు. త్రివిక్రమ్ తన దగ్గరకు వచ్చినప్పుడు తన మదిలో ఉన్న ట్యూన్స్ ని ప్లే చేస్తానని, అందులో, ఆయనకు నచ్చినవి తీసుకుంటారని చెప్పిన అనిరుథ్, త్రివిక్రమ్ ను ‘గురూజీ’ అని సంబోధిస్తానని అన్నాడు. కొత్త భాషకు సంబంధించిన ఓ చిత్రానికి సంగీతం అందించేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.