ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తా : అనిల్ రావిపూడి
- 'రాజా ది గ్రేట్' ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి
- ఎన్టీఆర్ ను కలిసిన మాట వాస్తవమే
- కొంత కథ వినిపించాను
- త్వరలోనే పూర్తి కథను వినిపిస్తాను
ఆ విషయాన్ని గురించి తాజాగా ఆయన స్పందిస్తూ .. తాను ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్న విషయం నిజమేనని చెప్పాడు. ఎన్టీఆర్ కోసం తాను రెడీ చేసిన కథను కొంతవరకూ వినిపించడం జరిగిందనీ, ఆ తరువాత కొన్ని కారణాల వలన మిగతా కథను వినిపించలేకపోయానని అన్నాడు. త్వరలోనే ఎన్టీఆర్ కి పూర్తి కథను వినిపిస్తానని చెప్పాడు. ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తాననీ .. తమ కాంబినేషన్లో తప్పకుండా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.