కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరికకు రంగం సిద్ధం.. రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం. గత రెండు రోజులుగా రేవంత్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు. రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వనున్నట్టు సమాచారం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీ వర్గం నేతకు అవకాశం లభించనుంది.

ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా దళితుడిని నియమించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతోందనే భావనతోనే కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చినట్టు చెబుతున్నారు.  
Go Back to Shorts
revanth reddy
tTelugudesam
congress
revanth reddy congress

More Telugu News