dera baba: శిక్ష ప‌డిన‌ 50 రోజుల త‌ర్వాత గుర్మీత్‌ను చూడ‌టానికి వెళ్లిన భార్య హ‌ర్జీత్ కౌర్‌

  • కొడుకు, కోడ‌లు, కూతురు, అల్లుడితో క‌లిసి వెళ్లిన హ‌ర్జీత్‌
  • దీపావ‌ళి స్వీట్లు తీసుకువ‌చ్చిన కుటుంబ స‌భ్యులు
  • డేరా బాబాను కుటుంబం క‌ల‌వ‌డం ఇది మూడో సారి
అత్యాచారం కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తున్న బాబా గుర్మీత్ సింగ్ రామ్ ర‌హీమ్‌ను చూడడానికి 50 రోజుల త‌ర్వాత అత‌ని భార్య హ‌ర్జీత్ కౌర్ రోహ్‌త‌క్‌లోని సునారియా జైలుకు వెళ్లింది. కుమారుడు జ‌స్మీత్ ఇన్సాన్‌, కోడ‌లు హుస‌న్‌ప్రీత్ ఇన్సాన్‌, కూతురు చ‌ర‌ణ్ ప్రీత్‌, అల్లుడు రుహ్‌-ఏ-మీత్‌ల‌తో క‌లిసి ఆమె వెళ్లారు. దీపావ‌ళి సంద‌ర్భంగా స్వీట్లు, చ‌లికాలం వేసుకోవాల్సిన దుస్తుల‌ను కుటుంబ స‌భ్యులు గుర్మీత్‌కి ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

డేరా బాబాను త‌న కుటుంబం క‌ల‌వ‌డం ఇది మూడోసారి. శిక్ష ప‌డిన త‌ర్వాత త‌నను చూడ‌టానికి వ‌చ్చే వారిలో పది మంది పేర్ల‌ను డేరా బాబా జైలు అధికారుల‌కు ఇచ్చాడు. ఆ పేర్ల‌లో భార్య పేరు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయిన‌ప్ప‌టికీ ఆమెను అనుమ‌తించ‌డంపై జైలు అధికారుల‌ను ప్ర‌శ్నించ‌గా వారి నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు.
dera baba
gurmeet baba
honey preet
jaseeb kaur
son
daughter
haryana jail
sonariya

More Telugu News