venumadhav: బూతు ఎక్కువగా ఉండటం వలన కొన్ని సినిమాలు వదులుకున్నాను!: కమెడియన్ వేణుమాధవ్

షార్ట్స్‌లో చూడండి
కొంతకాలం క్రితం వరకూ కమెడియన్ వేణుమాధవ్ లేని సినిమా ఉండేది కాదు. వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా ఉండేవారు. రచయితలు ఆయన కోసమే కొన్ని పాత్రలను సృష్టించిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటి వేణుమాధవ్ .. కొంతకాలంగా సినిమాలకి దూరంగా వుంటున్నారు. అందుకు గల కారణమేమిటని తాజా ఇంటర్వ్యూలో ఐ డ్రీమ్స్ ఆయనని ప్రశ్నించింది.

 కొన్ని సినిమాలను తాను వదులుకున్నాననీ .. కొంతమంది తనని ఎవైడ్ చేశారని వేణుమాధవ్ చెప్పారు. బూతు ఎక్కువగా ఉండటం వలన కొన్ని సినిమాలను తాను వదులుకున్నాననీ, ఎందుకంటే ఆ తరహా సీన్స్ ను తానే ఫ్యామిలీతో కలిసి చూసే పరిస్థితి లేదని అన్నారు. అలా నో చెప్పడం వలన .. ఆ తరువాత తనని వాళ్లు ఎవైడ్ చేశారని చెప్పారు. ఇక ఈ మధ్యనే మళ్లీ అవకాశాలు పుంజుకుంటున్నాయనీ, ముందుగా స్క్రిప్ట్ చూశాకే ఓకే అంటున్నానని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
venumadhav

More Telugu News