amir khan: ఆ సీక్రెట్ ను ఆమిర్ నుంచి నేర్చుకోవాలి : కోహ్లీ

  • రూబిక్ క్యూబ్ ను సులువుగా పరిష్కరించే ఆమిర్ ఖాన్
  • ఆ కిటుకు తెలుసుకోవాలన్న కోహ్లీ
  • ఆమిర్ ఖాన్ వినయం, నిజాయతీ కలిగిన వ్యక్తి
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ నుంచి ఒక సీక్రెట్ నేర్చుకోవాలని భావిస్తున్నాడు. ఈ విషయం కోహ్లీ స్వయంగా తెలిపాడు. దీపావళి సందర్భంగా అపరశక్తి ఖురానా టాక్ షోలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్, విరాట్ కోహ్లీ పాల్గొన్నారు. ఈ షోలో కోహ్లీకి సంబంధించిన పలు విషయాలను అతని నోటి వెంటే ఆమిర్ చెప్పించాడు.

అనంతరం రూబిక్ క్యూబ్ ను తక్కువ సమయంలో పరిష్కరించి ఆమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడు. దీంతో ఈ షో ముగిసిన తరువాత రూబిక్ క్యూబ్ ను పరిష్కరించే టెక్నిక్‌ ను అతని నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నానని తెలిపాడు. ఆమిర్ తో గడిపిన సమయం తనకు చాలా విలువైనదని చెప్పాడు. ఆయన ఎంతో వినయం, నిజాయతీ కలిగిన వ్యక్తి అని కోహ్లీ తెలిపాడు. 
amir khan
virat kohli
Rubik cube
aparashakti khurana

More Telugu News