అయోధ్య రాముడికి వెండి బాణాలు.. గిఫ్ట్‌గా ఇస్తామన్న ముస్లింలు
- పది బాణాలను బహుమానంగా ఇవ్వాలని షియా వక్ఫ్ బోర్డు నిర్ణయం
- ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ
- ఉగ్రవాదంపై భారత్ పోరుకు ప్రతీకలని అభివర్ణన
తాము రాముడికి బహూకరించనున్న బాణాలు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధానికి ప్రతీకలని ఆయన అభివర్ణించారు. ‘‘మర్యాద పురుషోత్తముడైన రాముడు దుష్టశక్తులపై పోరాడి బాణాలతోనే రాక్షసులను సంహరించాడని, ఇప్పుడు తాము ఇవ్వబోయే బాణాలు కూడా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ప్రతీకలని లేఖలో పేర్కొన్నారు. ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలని రిజ్వీ పిలుపునిచ్చారు.