బుట్టా రేణుక: ఎంపీ బుట్టా రేణుకపై వైసీపీ వేటు!

  • రేణుకను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ ప్రకటన
  • పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు చేసే అవకాశం కోల్పోతామంటున్న వైసీపీ నేతలు
  • రేపు ఉదయం టీడీపీలో చేరనున్న రేణుక!
కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుకపై వేటు పడింది. రేణుకను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో చర్చనీయాంశమైనట్టు తెలుస్తోంది. ఆమెను సస్పెండ్ చేయడం వల్ల పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసే అవకాశం కోల్పోతామని వైసీపీ నేతలు అనుకుంటున్నట్టు సమాచారం.

 కాగా, రేపు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును రేణుక కలవనున్నారని,  బాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని సమాచారం. కర్నూలు జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రేణుకకు టీడీపీ తరపున పోటీ చేసేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయని ‘తెలుగుదేశం’ వర్గాల సమాచారం.
బుట్టా రేణుక
జగన్

More Telugu News