వర్మ: వర్మపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి!
- టీడీపీకి వ్యతిరేకంగా సినిమా తీస్తే చూస్తూ ఊరుకోబోం
- కులాల మధ్య చిచ్చుపెట్టేలా చిత్రాలు నిర్మిస్తున్నారు
- టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మండిపాటు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించనున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను టీడీపీకి చెందిన మరో నాయకుడు తాజాగా హెచ్చరించారు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో కులాల మధ్య చిచ్చు పెడుతూ రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్మ ఓ సైకో అని, ఎన్టీఆర్ కు, టీడీపీకి వ్యతిరేకంగా సినిమా నిర్మిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సినిమా తీయడం వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు.