వర్మ: టీడీపీ వారు నన్ను విమర్శిస్తోంటే నాకు ఎంటర్‌టైన్ మెంట్‌గా అనిపిస్తోంది: వర్మ
- లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తానంటే విమర్శిస్తున్నారు
- నా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తానని వాణీ విశ్వనాథ్ అన్నారు
- మరి కొందరు మరోలా విమర్శలు చేస్తున్నారు
టీడీపీ వారు తనను విమర్శిస్తోంటే తనకు ఎంటర్‌టైన్ మెంట్‌గానే అనిపిస్తోందని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ... తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో సినిమా తీస్తానంటే తన ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తానని ఇటీవలే వాణీ విశ్వనాథ్ అన్నారని, అందుకే తాను తనకు ఇల్లేలేదని చెప్పానని, తనను పట్టుకోవాలంటే రోడ్డుపైకే రావాలని, ఒకవేళ వస్తే వాణీవిశ్వనాథ్ పాదాలు పాడవుతాయని చెప్పానని అన్నారు.
అలాగే మరికొందరు నేతలు విమర్శలు చేశారని, వారికి కూడా సమాధానం ఇచ్చానని చెప్పారు. ఎన్టీఆర్ దేవుడి కన్నా గొప్పవారని, తాను దండం పెడితే ఆయనకే పెడతానని, తనకు భద్రాచలం రామయ్య, తిరుపతి వేంకటేశ్వరుడు కూడా నచ్చలేదని అన్నారు. ఎన్టీఆర్ పర్సనాలిటీ, ముఖం ఆ దేవుళ్ల కంటే బాగుంటాయని వ్యాఖ్యానించారు.