జగపతిబాబు: అమెరికన్ ని ప్రేమించానని మా అమ్మాయి నాకు చెబితే.. నేను ఒక్కటే చెప్పాను!: సినీ నటుడు జగపతిబాబు

  • ప్రేమించిన అతన్నే పెళ్లి చేసుకోమని చెప్పా
  • ప్రశాంతంగా అన్ని విషయాలు ఆలోచించుకోమన్నా
  • కులం గురించి నాకు ఎటువంటి అభ్యంతరం లేదన్న జగపతిబాబు
అమెరికన్ ని ప్రేమించానని, అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నానని తన కూతురు తనకు చెబితే చేసుకోమని చెప్పానని ప్రముఖ సినీనటుడు జగపతిబాబు అన్నారు. ‘టీవీ 9’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కూతురి ప్రేమ వివాహం గురించి ప్రస్తావించారు.

 ‘అమెరికన్ ని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నా కూతురు నాకు చెబితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకోమన్నాను. కానీ, ఏడు, ఎనిమిది నెలలు ప్రతి విషయం గురించి మాట్లాడుకోండి. భవిష్యత్తు గురించి, పిల్లల గురించి, ఆస్తుల గురించి మాట్లాడుకోమని చెప్పా. యాభై ఏళ్ల తర్వాత మీరిద్దరు ఎలా ఉంటారో ఊహించుకుని, ప్రశాంతంగా ఆలోచించుకున్న తర్వాత నాకు ఫోన్ చేయమని నా కూతురికి చెప్పా.

ఇద్దరూ పెళ్లికి ఓకే అంటే..నేను పెళ్లి చేస్తాను అని మా అమ్మాయికి అప్పుడు చెప్పాను. వాస్తవం చెప్పాలంటే..వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు..వాళ్లిద్దరూ జీవించాలి. మనం చూడాల్సిందల్లా అబ్బాయి మంచివాడా? కాదా? అన్నదే. కనీసం కొంతవరకైనా ఈ విషయం గురించి తెలుసుకోవాలి’ అని అన్నారు.

తర్వాత మళ్లీ ఆయనే చెబుతూ, "ఆ టైమ్ లో మా అమ్మ నాతో ఓ మాట అంది. ‘ఎక్కడో అమెరికా అంటున్నావు! తెల్లబ్బాయి అంటున్నావు! ఎటువంటి వాడో మనకు తెలీదు, ఫర్వాలేదా! ఓసారి కనుక్కో’ అంది. ‘అమెరికాలో మనం ఎలా కనుక్కుంటాం. మన అమ్మాయికి 27 ఏళ్లు వచ్చాయి. తనకీ కామన్ సెన్స్ ఉంటుంది. తను ప్రేమించింది.. తను పెళ్లి చేసుకుంటానంటోంది. ఇందులో మనం పెద్దగా ఆలోచించాల్సిన విషయమేమీ లేదు..’ అని చెప్పాను.

కులం గురించి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అదేమాట మా అమ్మ కూడా చెప్పింది... పెళ్లయిన తర్వాత మా అమ్మాయిని బంగారంలా మా అల్లుడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఏది గొప్పదైంది? కులమా? ప్రేమ?’ అని జగపతిబాబు ప్రశ్నించారు.
జగపతిబాబు
అమెరికన్

More Telugu News