rajashekar: నేను ఎదిగితే తాముండలేమని కొందరు అనుకున్నారు: హీరో రాజశేఖర్ సంచలన కామెంట్స్

  • అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయి
  • నాతో యాక్ట్ చేయవద్దని హీరోయిన్స్ కు చెప్పారు
  • కానీ టాలెంట్ ను తొక్కేయలేకపోయారు
  • 'గరుడవేగ' ప్రమోషన్ లో హీరో రాజశేఖర్
1990వ దశకంలో తాను నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అవుతున్న వేళ, తాను ఎదుగుతూ ఉంటే తాముండలేమని భావించిన కొందరు, తనను అణగదొక్కేందుకు ప్రయత్నించారని హీరో రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం 'గరుడవేగ' ప్రమోషన్ కోసం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, "కొన్ని ఉంటాయి. కొంతమంది... నేను ఎదిగితే వాళ్లకు కాంపిటేటివ్ అవుతాను అనుకున్నారు. అందువల్ల నన్ను తొక్కేశారని అనుకోవచ్చు... లేదు అది జరిగివుండవచ్చు. జరిగింది కూడా. ఎంతో మంది హీరోయిన్స్ ను నాతో యాక్ట్ చేయవద్దు అని అడ్వయిజ్ చేసిన వాళ్లు ఉన్నారు. ఎంతో మంది డైరెక్టర్స్ ను నాతో చేయవద్దు అని చెప్పిన వాళ్లు ఉన్నారు. టాలెంట్ ఉన్న వాళ్లను ఎవరూ తొక్కేయలేరు. టాలెంట్ ను ఎవరూ మూసేయలేరు" అని అన్నారు. సహనం, ఓర్పు తన భార్యకు ఉన్న సద్గుణాలని, అవే తనను ఎన్నోమార్లు కాపాడాయని అన్నారు.
rajashekar
garudavega
industry

More Telugu News