dhoni: మైదానంలో అలసిన ధోనీకి నీరు తీసుకెళ్లి ఇస్తున్న జీవా... క్యూట్ వీడియోను చూడండి!

  • సరదాగా ఫుట్ బాల్ ఆడిన ధోనీ
  • కోహ్లీ, అభిషేక్ బచ్చన్ టీమ్ ల మధ్య మ్యాచ్
  • అలసిన ధోనీకి మంచినీళ్లు అందించిన జీవా
ఇటీవలే ఆస్ట్రేలియాతో క్రికెట్ సిరీస్ ను ముగించుకుని, త్వరలో జరిగే న్యూజిలాండ్ సిరీస్ కు సిద్ధమవుతూ, మధ్యలో దొరికిన దీపావళి సెలవులను భారత క్రికెటర్లు ఆస్వాదిస్తున్న వేళ, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని 'ఆల్ హార్రట్ ఎఫ్సీ' అభిషేక్ బచ్చన్ నేతృత్వంలోని 'ఆల్ స్టార్స్ ఎఫ్సీ' జట్లు సెలబ్రిటీ ఫుట్ బాల్ మ్యాచ్ ఆడిన వేళ ఓ ఆసక్తికర ఘటన జరిగింది.

 ముంబై ఫుట్ బాల్ ఎరీనాలో జరిగిన పోటీలో తనకు లభించిన ఫ్రీ కిక్ ను సద్వినియోగం చేసుకుని, గోల్ కీపర్ మార్క్ రాబిన్ సన్ కు చిక్కకుండా బంతిని గోల్ లోకి పంపించిన 38 ఏళ్ల ధోనీ, ఆపై విశ్రాంతి సమయంలో అలసిపోయి మైదానంలో కూర్చుండిపోగా, ఆయన గారాలపట్టి జీవా, బుడిబుడి అడుగులతో వచ్చి స్వయంగా మంచినీటిని తెచ్చి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా,ఈ మ్యాచ్ లో అభిషేక్ జట్టు 7-3 తేడాతో కోహ్లీ టీమ్ ను ఓడించింది. ధోనీకి జీవా మంచినీటిని అందిస్తున్న క్యూట్ వీడియోను చూడవచ్చు.
dhoni
jeeba
kohli
abhisheik bachchan

More Telugu News