ys jagan: గన్నవరంలో జగన్ కు ఘన స్వాగతం.. విజయవాడ నుంచి ధర్మవరం వెళ్లనున్న జగన్

  • పార్టీ బీసీ సెల్ సమావేశంలో పాల్గొననున్న జగన్
  • బీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
  • చేనేత కార్మికులకు భరోసా కల్పించేందుకు అటు నుంచి ధర్మవరంకు జగన్
వైసీపీ అధినేత జగన్ గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు జగన్ అధ్యక్షతన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ బీసీ సెల్ సమావేశం జరగనుంది. బీసీలకు జరుగుతున్న అన్యాయం, వారి వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి వైసీపీ బీసీ విభాగం నేతలు హాజరుకానున్నారు. మరోవైపు, ధర్మవరంలో తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ చేనేత కార్మికులు నెల రోజులకుపైగా దీక్షను కొనసాగిస్తున్నారు. వారికి భరోసా కల్పించేందుకు జగన్ ధర్మవరం వెళ్లనున్నారు. 
ys jagan
ysrcp
ysrcp bc cell
dharmavaram
dharmavaram weavers protest

More Telugu News