trumph: ట్రంప్ కు మోదీ కౌగిలి అవసరమైనట్టు ఉంది!: రాహుల్ గాంధీ సెటైర్

  • గతంలో అమెరికా, పాక్ మధ్య విభేదాలు
  • మళ్లీ దగ్గరయ్యామని ప్రకటించిన ట్రంప్
  • పాక్ నేతలకు ట్విట్టర్ మాధ్యమంగా ధన్యవాదాలు
  • ట్రంప్ ట్వీట్ ను రీట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
'మోదీజీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కి మీ కౌగిలి అవసరమైనట్టు ఉంది' అంటూ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్య వ్యాఖ్యలను పోస్టు చేశారు. తాజాగా పాకిస్థాన్ నుద్దేశిస్తూ ట్రంప్ ఒక ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 'పాకిస్థాన్ తో బంధాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు పడ్డాయి. పాకిస్థాన్ నాయకత్వానికి ధన్యవాదాలు' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.

దీంతో గత కొంత కాలంగా పాకిస్థాన్ తో ఏర్పడిన వివాదాలకు తెరవేసినట్టైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ ‘మోదీజీ.. త్వరపడండి. చూస్తుంటే ట్రంప్‌ కు మీ కౌగిలి మరోసారి అవసరమైనట్లుంది’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 
trumph
modi
rahul gandhi
comments

More Telugu News