కేజ్రీవాల్: కేజ్రీవాల్‌ కారు పార్కింగ్ ప్రదేశంలో లేదు!: చోరీకి గురైన కారుపై ఢిల్లీ పోలీస్ వివరణ

  • ఢిల్లీ సెక్రటేరియట్ కు సమీపంలో కారును గుర్తించిన పోలీసులు
  • ఈ కారుకు స్టీరింగ్ లాక్, గేర్ లాక్ వ్యవస్థలు లేవు
  • ఢిల్లీ పోలీస్ ప్రతినిధి మధూర్ వర్మ

అపహరణకు గురైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుకు స్టీరింగ్ లాక్, గేర్ లాక్ వ్యవస్థలు లేకపోవడం వల్లే ఈ కారు దొంగతనానికి గురైందని ఢిల్లీ పోలీస్ ప్రతినిధి మధూర్ వర్మ అన్నారు. చోరీకి గురైన కేజ్రీవాల్ కారు నిన్న దొరికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చోరీకి గురైన నీలిరంగు వేగనార్ కారు కేజ్రీవాల్ సొంతది కాదని, దీనిని ఆయన ఉపయోగించడం లేదని అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ పేరిట ఈ కారు రిజిస్ట్రేషన్ అయి ఉందని, ఆ పార్టీ నేత వందన సింగ్ దీనిని ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ సెక్రటేరియట్ పార్కింగ్ ప్రదేశానికి రెండొందల మీటర్ల దూరంలోనే ఇది ఉందని అన్నారు. కార్లకు స్టీరింగ్ లాక్, గేర్ లాక్ వ్యవస్థలు ఉంటే వాటిని సులభంగా దొంగిలించలేరని అన్నారు. పార్కింగ్ స్థలాల్లో వాహనాలను ఉంచకపోవడం వల్లే అధికశాతం వాహనాలు చోరీకి గురవుతున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News