‘రాజుగారి గది 2’: ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పి.. ఫొటోను పోస్ట్ చేసిన నాగ్!

  • ట్వీట్ చేసిన నాగార్జున
  • ఈ చిత్రాన్ని ప్రేమతో ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు
  • చై-సామ్ పెళ్లి వేడుకలో సమంతతో సరదాగా దిగిన ఫొటోను పోస్ట్ చేసిన నాగ్

ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజుగారి గది 2’ చిత్రం మంచి టాక్ సంపాదించుకోవడంపై నటుడు నాగార్జున స్పందించారు. ‘‘రాజుగారి గది 2’ చిత్రాన్ని ప్రేమతో ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ అని తన ట్విట్టర్ ఖాతాలో నాగ్ ఓ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా నాగ చైతన్య-సమంత పెళ్లి వేడుక లో సమంతతో తాను కలసి ఉన్న ఫొటోలను నాగ్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో వాళ్లిద్దరూ ఎంతో ఆనందంతో, ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News