mahesh babu: పారితోషికం తిరిగి ఇచ్చేసిన మహేశ్ బాబు!

  • మహేశ్ మనసు సున్నితం 
  • నిర్మాతలు నష్టపోవడం ఇష్టం ఉండదు
  • వాళ్లకి సాయపడటానికి వెనుకాడడు  
మహేశ్ బాబు చాలా సున్నితమైన మనసున్నవాడని ఆయన సన్నిహితులు .. దగ్గర నుంచి చూసిన వాళ్లు చెబుతుంటారు. తనతో పాటు తన చుట్టూ వున్నవాళ్లు బాగుండాలని కోరుకునే మనస్తత్వం ఆయనది. అందువల్లనే తనని నమ్మిన నిర్మాతలు నష్టపోకుండా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఒకవేళ నష్టపోవడమంటూ జరిగితే .. తనవంతు సాయాన్ని అందించడానికి ముందుకువస్తాడు.

 అలాగే 'స్పైడర్' నిర్మాతకి కూడా తనవంతు హెల్ప్ ను అందించినట్టు ఫిల్మ్ నగర్ టాక్. 'స్పైడర్' సినిమా కోసం మహేశ్ చాలా సమయాన్ని కేటాయించాడు. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు చేయడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోవడంతో, నిర్మాతకి నష్టాలు వచ్చాయట. దాంతో ఈ సినిమా కోసం తాను తీసుకున్న పారితోషికాన్ని మహేశ్ తిరిగి ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. సాధారణంగా నిర్మాత నష్టపోతే .. మరో సినిమా చేసిపెడతామని కొంతమంది హీరోలు చెబుతుంటారు. అందుకు భిన్నంగా మహేశ్ వ్యవహరించడం గురించి అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు.  
mahesh babu

More Telugu News