amrapali collector: కేటీఆర్ ముందు చేతులు జోడించి సర్దిచెప్పబోయిన కలెక్టర్ అమ్రపాలి... ఫోటో చూడండి!

  • వరంగల్ అభివృద్ధి సమీక్షా సమావేశంలో కేటీఆర్ ఆగ్రహం
  • వాదించవద్దని కలెక్టర్ ఆమ్రపాలిని గద్దించిన మంత్రి
  • చేతులు జోడించి వివరణ ఇవ్వబోయిన కలెక్టర్
వరంగల్ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్ లో జరిగిన సమీక్షలో పాల్గొన్న తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే అమలు కావడం లేదని, పనులు ముందడుగు వేయడం లేదని, ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వేళ, కలెక్టర్ ఆమ్రపాలి కల్పించుకోగా, తనతో వాదించవద్దని కేటీఆర్ గద్దించారు.

ఆపై ఆమ్రపాలి చేతులు జోడించి వరంగల్ పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సర్దిచెప్పబోయినట్టు తెలుస్తోంది. సీరియస్ గా చూస్తున్న కేటీఆర్ వైపు నమస్కరించి నిలబడి ఏదో మాట్లాడుతున్న ఆమ్రపాలి ఫోటోను మీరూ చూడవచ్చు.
amrapali collector
warangal
KTR

More Telugu News