అర్జున్ రెడ్డి: అక్కడ ఏ గదిలో చూసినా విద్యార్థులు ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూస్తూ కనిపిస్తున్నారు.. విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియో!

  • ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా భారీ స్పంద‌న
  • మురిసిపోతోన్న విజయ్ దేవరకొండ
  • ఐఐటీ అల‌హాబాద్‌లో త‌న సినిమాకు అంద‌రూ ఔట్ అయిపోయార‌ని ట్వీట్
  • ల్యాప్ టాప్ లలో అదేపనిగా సినిమా చూస్తోన్న యువత
తాను న‌టించిన‌ ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా భారీ స్పంద‌న రావ‌డంతో సంబ‌రంలో మునిగి తేలుతోన్న యువ‌న‌టుడు విజ‌య్ దేవ‌రకొండ ఆ సంతోషం నుంచి ఇంకా బ‌య‌ట‌ ప‌డ‌లేక‌పోతున్నాడు. నిన్న త‌న సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవ‌డంతో ‘హాఫ్ సెంచరీ... బ్యాట్ పైకెత్తుతున్నా’నని ట్వీట్ చేసిన‌ విజయ్ దేవరకొండ ఈ రోజు త‌న సినిమాకు సంబంధించి మ‌రో ట్వీట్ చేసి ఓ విష‌యాన్ని తెలిపాడు. ఐఐఐటీ అల‌హాబాద్‌లో త‌న సినిమాకు అంద‌రూ ఔట్ అయి పోయార‌ని (దాసోహం అయిపోయార‌ని) పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో ఐఐఐటీ విద్యార్థులు అంద‌రూ త‌మ హాస్ట‌ల్‌లోని గ‌దుల్లో అర్జున్ రెడ్డి సినిమా చూస్తూ క‌న‌ప‌డ్డారు. ప్ర‌తీ రూమ్‌లోనూ విద్యార్థులు అదే ప‌ని చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో యూనివ‌ర్సిటీ టాపర్‌గా, తాగుబోతుగా, డ్ర‌గ్స్ తీసుకునే వాడిగా విజ‌య్ దేవ‌రకొండ న‌టించాడు. ఈ సినిమాను యువ‌త త‌మ ల్యాప్‌టాప్‌ల‌లో అదే ప‌నిగా చూస్తున్నారు. తాము నాలుగు సార్లు ఈ సినిమా చూశామ‌ని విజ‌య్ దేవ‌రకొండ పోస్ట్‌కి ఆయ‌న అభిమానులు కామెంట్ పెడుతున్నారు.
అర్జున్ రెడ్డి

More Telugu News