russian: రష్యా వెళ్లను...భారత్ లోనే ఉండి భిక్షాటన చేసుకుంటానంటున్న యువకుడు!

  • రష్యా వెళ్లను...ఇక్కడే ఉండి భిక్షాటన చేస్తాను
  • నవంబర్ 22 వరకు టూరిస్టు వీసా గడువు
  • సహాయం కోరితే చేస్తామంటున్న రష్యా ఎంబసీ
అక్టోబర్ 10న తమిళనాడులోని కాంచీపురంలోని పశ్చిమ రాజవీధి కుమరకొట్టం మురుగన్‌ ఆలయం వద్ద రష్యాకు చెందిన ఈవ్జెనీ ఫోర్డ్ని అనే యువకుడు టోపీచాచి భిక్షాటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్థానికులిచ్చిన ఫిర్యాదుతో ఎస్సై తులసి కొంత మొత్తాన్ని అతనికి ఇచ్చి, చెన్నై వెళ్లి తమ దేశ అధికారుల సహాయం పొందాల్సిందిగా చెప్పారు.

నవంబర్ 22 వరకు తనకు వీసా గడువు వుందని, అయితే, తిరిగి రష్యా వెళ్లనని, భారత్ లోని భిక్షాటన చేస్తానని చెప్పడంతో దౌత్యాధికారులు అయోమయానికి గురయ్యారు. దీంతో ఆయన ప్రస్తుతం టీ.నగర్ వీధుల్లో భిక్షాటన చేస్తుండడం విశేషం. దీనిపై ప్రశ్నించిన మీడియాకు వారు సమాధానమిస్తూ, ఈవ్జెనీ ఫోర్డ్నీ తమను సహాయం కోరలేదని, తమను సహాయం కోరితే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 
russian
tamilnadu
chennai
t nagar
begging

More Telugu News