kejriwal: ఎట్టకేలకు కేజ్రివాల్ కారు దొరికింది!

  • కారును సచివాలయం ముందు పార్క్ చేసిన కేజ్రీవాల్
  • చోరీకి గురైన కేజ్రీవాల్ వ్యాగన్ ఆర్ కారు
  • భద్రతపై లేఖ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ ను నిలదీసిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు ఎట్టకేలకు దొరికింది. అరవింద్ కేజ్రీవాల్ కు 2013లో కుందర్ శర్మ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి నీలిరంగు వ్యాగన్ ఆర్ కారును బహుమతిగా ఇచ్చారు. దానితోనే 2014 ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు. ఢిల్లీ సచివాలయం ముందు నిలిపిన ఆ వాహనాన్ని ఎవరో ఆగంతుకులు దొంగిలించారు.

దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ను కేజ్రీవాల్ నిలదీశారు. ‘కారుకే భద్రత లేకపోతే.. ఇక సామాన్యుడి మాటేంటి? కారు పోవడం చిన్న విషయమే, కానీ అది సచివాలయం ఎదుట పోయింది. ఢిల్లీలో శాంతి, భద్రతలు గాడితప్పుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనం’ అంటూ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఘజియాబాద్‌ లోని మోహన్‌ నగర్‌ సమీపంలో కేజ్రీవాల్ కారును పోలీసులు గుర్తించారు. 
kejriwal
anil bizal
car
safety

More Telugu News