cricket: హెచ్సీఏ నిర్వహణపై ప్రేక్షకుల ఆగ్రహం!

  • ఉప్పల్ లో అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ ఉందన్న హెచ్సీఏ
  • రెండు గంటలు సమయం ఇస్తే స్టేడియం సిద్ధం చేస్తామన్న హెచ్సీఏ
  • మొన్న కురిసిన వర్షాలకు చిత్తడిగా మారిన స్టేడియం
టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన మ్యాచ్ రద్దుకావడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో నిర్వహించాల్సిన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ను నిర్లక్ష్యంతో రద్దయ్యేలా చేశారని మండిపడుతున్నారు. ఉప్పల్ లో అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ ఉందని, ఎంత వర్షం పడినా రెండు గంటలు తెరిపిస్తే కనుక మ్యాచ్ కు గ్రౌండ్ ను సిద్ధం చేస్తామని హెచ్సీఏ ఘనంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిన్నంతా ఎండకాసింది. దీంతో స్టేడియంపై కవర్లను తొలగించారు.

 సాయంత్రం ఆరుగంటల సమయంలో నగరంలో కాసేపు వర్షం పడింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు స్టేడియం చిత్తడిగా మారింది. కేవలం క్రీజు, 100 యార్డ్స్ సర్కిల్ ను మాత్రమే కప్పి ఉంచిన సిబ్బంది. 100 యార్డ్స్ సర్కిల్ నుంచి బౌండరీ లైన్ వరకు వదిలేసింది. కనీసం పట్టించుకోలేదు. దీంతోనే స్టేడియం ఆటకు అనుకూలంగా లేకుండా పోయింది. దీంతో బౌండరీ లైన్ వద్ద నేలను పరిశీలించిన అంపైర్లు స్టేడియం మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేదని ప్రకటించారు. ఆ విధంగా టైటిల్ విజేతను తేల్చే మ్యాచ్ జరగకుండానే టోర్నీ ముగిసింది. 
cricket
team india
Australia
hydarabad
uppal
3rd t20

More Telugu News