Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్ నేటి నుంచే.. పాప్యులర్ బ్రాండ్లపై ఆశ్చర్యపరిచే ఆఫర్లు!

  • మరోమారు భారీ ఆపర్లతో వచ్చేసిన ఫ్లిప్‌కార్ట్
  • స్మార్ట్‌ఫోన్లపై అమేజింగ్ ఆఫర్లు
  • ఎక్స్‌చేంజ్, నోకాస్ట్ ఈఎంఐ, బై బ్యాక్ గ్యారెంటీ కూడా..
దీపావళి పర్వదినాన్ని సొమ్ము చేసుకునేందుకు ఈ-కామర్స్ సంస్థలు ఒక్కొక్కటిగా రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చేసింది. నేటి నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. బై బ్యాక్ ఆఫర్‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా పది శాతం రాయితీ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సెర్వ్ కార్డులపై నో కాస్ట్- ఈఎంఐ ఆఫర్‌ ఉన్నట్టు తెలిపింది.

ఆఫర్ల వివరాలు..
షియోమీ రెడ్‌మీ నోట్ 4 అసలు ధర రూ.12,999 కాగా దానిని రూ.10,999కే అందిస్తోంది. మోటో సి ప్లస్‌ను రూ.5,999కే అందిస్తుండగా దాని అసలు ధర రూ.6,999. లెనోవో కే8 ప్లస్ (3జీబీ) అసలు ధర రూ.10,999 కాగా దానిని రూ.8,999కే ఇవ్వనున్నట్టు తెలిపింది.

శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్2పై రూ.1000 తగ్గించి రూ.15,900, ఎక్స్‌చేంజ్‌పై రూ.3 వేలు అదనంగా ఇస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.29,990కి విక్రయిస్తుండగా ఎక్స్‌చేంజ్‌పై మరో రూ.3వేలు అదనంగా ఇస్తోంది. మోటో ఈ4ప్లస్ రూ.9,499కే అందుబాటులో ఉంది. దీనిపైనా రూ.1000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రోను రూ.5,999కే అందుబాటులో ఉంచింది.

వీటితోపాటు మోటో టర్బో, మోటో ఎక్స్, హవేయి, లీఎకో లీ మ్యాక్స్ 2, గూగుల్ పిక్సెల్ (32 జీబీ) తదితర వాటిపైనా కుప్పలు తెప్పలుగా ఆఫర్లు ప్రకటించింది.
Flipkart
Diwali
Sale
Offers

More Telugu News