dhoni: అబ్బాయి ఎప్పుడొస్తాడో!... 13 ఏళ్లుగా ధోనీ కోసం ఎదురు చూస్తున్న ఖరగ్ పూర్ 'అమ్మ'!

  • టీమిండియాలో స్థానం రాకముందు ఖరగ్ పూర్ లో ఉన్న ధోనీ
  • ధోనీ ఇంట్లో వంటపని మినహా అన్ని పనులు చూసిన కళావతి
  •  ఇటీవల 'అమ్మ' గురించి ఎంక్వయిరీ చేసిన ధోనీ  
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ కోసం 13 ఏళ్లుగా ఒక మహిళ ఎదురు చూస్తున్నారు. ధోనీ గతంలో ఖరగ్ పూర్ లో టికెట్ చెకింగ్ ఉద్యోగిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రైల్వే శాఖ సౌత్ సైడ్ లో కేటాయించిన క్వార్టర్ లో ఉండేవాడు. ఆ సమయంలో ధోనీ ఇంట్లో కళావతి (77) అనే మహిళ వంట మినహా అన్ని పనులు చూసుకునేవారు. ఆమెను ధోనీ 'అమ్మా' అని పిలిచేవాడు. ఒకసారి ధోనీకి సుస్తీ చేస్తే ఆమె కన్నతల్లిలా సపర్యలు చేశారు.

తర్వాత టీమిండియా తరపున ఆడే అవకాశం వచ్చినప్పుడు.. వెళ్లిపోతూ 'నిన్ను తప్పకుండా వచ్చి కలుస్తా'నని ధోనీ మాట ఇచ్చాడు. అయితే జట్టులో స్థానం సంపాదించిన తరువాత ఖరగ్ పూర్ వచ్చి ఆమెను పరామర్శించలేదు. అయితే ఆమె మాత్రం ధోనీ కోసం ఎదురు చూస్తున్నారు. ఖరగ్ పూర్ నుంచి ధోనీని కలిసేందుకు వెళ్లినవారందర్నీ అమ్మ ఎలా ఉందని అడిగారని, ఖరగ్ పూర్ వచ్చినప్పుడు తప్పకుండా అమ్మను కలుస్తానని చెప్పారని ఇటీవల ధోనీని కలిసిన వాసూరావు అనే వ్యక్తి తెలిపారు. 
dhoni
kharagpur
old lady
kalavathi
waiting

More Telugu News