వాన: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- పలు చోట్ల ట్రాఫిక్ జామ్
- శిల్పారామం వద్ద రహదారులు జలమయం
- మాదాపూర్‌లో స్తంభించిన వాహన రాకపోకలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని విద్యానగర్ రోడ్ నెం.6 వద్ద స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్‌లో వాహన రాకపోకలు స్తంభించాయి. శిల్పారామం వద్ద రహదారులు జలమయం అయ్యాయి. నగరంలోని మాదాపూర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, యూసఫ్‌గూడ, మోతీనగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.