సెహ్వాగ్ ట్వీట్: డెన్మార్క్ లో మనుషుల కన్నా పందులే ఎక్కువ: సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్

  • ట్విట్ట‌ర్‌లో వినూత్న రీతిలో పోస్టులు చేసే సెహ్వాగ్
  • ‘ఆస‌క్తిక‌ర నిజం’ అంటూ ట్వీట్
  • న్యూజిలాండ్‌లో మ‌నుషుల క‌న్నా 33 రెట్లు అధికంగా గొర్రెలు ఉంటాయి
ట్విట్ట‌ర్‌లో వినూత్న రీతిలో పోస్టులు చేస్తూ త‌న ఫాలోవ‌ర్ల‌ను అమితంగా అల‌రిస్తూ ట్విట్ట‌ర్ కింగ్ గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ అప్పుడ‌ప్పుడు త‌న అభిమానుల‌కు జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌ను కూడా చెబుతుంటాడు. మామూలుగా కాకుండా అందులో హాస్యాన్ని జోడించి మ‌రీ చెబుతుంటాడు.

అలాగే, ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తెలుసుకున్న సెహ్వాగ్ ఈ రోజు ఓ ట్వీట్ చేశాడు. ‘ఆస‌క్తిక‌ర నిజం- డెన్మార్క్‌లో మ‌నుషుల క‌న్నా పందులే అధికంగా ఉంటాయి. న్యూజిలాండ్‌లో మ‌నుషుల క‌న్నా 33 రెట్లు అధికంగా గొర్రెలు ఉంటాయి’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ అభిమానుల‌ను అల‌రిస్తోంది.
సెహ్వాగ్ ట్వీట్

More Telugu News