hyderabad: హైదరాబాద్ లో బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడంపై ఆంక్షలు
- రోడ్లపై బాణసంచా పేల్చకూడదు: హైదరాబాద్ సీపీ
- ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు
- సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నాం
ఢిల్లీలో దీపావళి పండుగ సందర్భంగా టపాసులు పేల్చరాదంటూ వాటి అమ్మకాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించిన అనంతరం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ దీపావళి రోజున మూడు గంటలే కాల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోనూ అటువంటి ఆదేశాలే జారీ అయ్యాయి. ఈ నెల 17 నుంచి 20 వరకు జంట నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లోను, రోడ్లపైన బాణసంచా కాల్చకూడదని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆదేశాలను ధిక్కరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు.