bengaluru: కొత్త తరహా నిరసన: బెంగళూరు రోడ్డు మీది నీటి గుంత‌ల్లో 'సాగరకన్య'!

షార్ట్స్‌లో చూడండి
బెంగ‌ళూరు రోడ్ల మీదికి సాగ‌ర క‌న్య వ‌చ్చింది. ఆకుప‌చ్చ శ‌రీరంతో రోడ్ల మీద ఉన్న గుంత‌ల్లో ఈత కొడుతోంది. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు రోడ్ల మీద ప‌డిన గుంత‌ల వ‌ల్ల బెంగ‌ళూరు ప్ర‌జ‌లు ఎదుర్కుంటున్న అవ‌స్థ‌ల‌ను తెలియజేసేందుకు ఆర్టిస్ట్ బాద‌ల్ ఇలా వినూత్నంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాడు. ఆయ‌న‌కు క‌న్న‌డ న‌టి సోను గౌడ స‌హాయం చేస్తోంది.

సాగ‌ర క‌న్య‌లాగ దుస్తులు ధ‌రించి న‌డిరోడ్డు మీద గుంత‌ల్లో రంగు నీళ్లు పోసి ఇలా నిర‌స‌న తెలియ‌జేస్తున్న బాద‌ల్‌, సోనుల‌కు బెంగ‌ళూరు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. మ‌రోప‌క్క సోను గౌడ‌ సాగ‌ర క‌న్య‌లాగ పోజులిచ్చిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆమె ఫొటోల‌ను షేర్ చేస్తూ రోడ్ల మీది గుంత‌ల‌కు నిర‌స‌న తెలుపుతున్న ఆమెకు నెటిజ‌న్లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. బాదల్, సోనుల‌ నిరసనతోనైనా బెంగళూరులో గుంతల నుంచి ప్రజలకు విముక్తి కల‌గాల‌ని కోరుకుంటున్నారు.
Go Back to Shorts
bengaluru
mermaid
protest
pot holes
badal

More Telugu News