rajugari gadi-2: దెయ్యంగా సమంత, మెంటలిస్టుగా నాగ్... ఇరగదీశారట... 'రాజుగారి గది-2' రివ్యూస్!

  • నేడు విడుదలైన రాజుగారి గది-2
  • పాజిటివ్ రివ్యూలు రాస్తున్న విశ్లేషకులు
  • సమంత, నాగ్ మధ్య సీన్స్ హైలైట్స్ అట
  • హిట్ కొట్టినట్టేనంటున్న సినీ పండితులు
ఈ ఉదయం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'రాజుగారి గది-2' సినిమాపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. నాగార్జున, సమంత వంటి టాప్ స్టార్స్ ఉన్నా, వారిని ఎక్కువ సేపు చూపాలన్న ఆలోచనను పక్కన బెట్టి, కథ ప్రకారం స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే రాసుకున్న ఓంకార్ విజయం సాధించినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దెయ్యంగా సమంత, మనసులో ఉన్న విషయాన్ని కళ్లతో చూసి చెప్పే మెంటలిస్టు పాత్రలో నాగార్జున ఇరగదీశారని, వీరిద్దరి మధ్యా వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రంలో పాటలు లేకపోవడం ప్లస్ పాయింట్ అయిందని భావిస్తున్నట్టు రివ్యూలు రాస్తున్న విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద తొలి సగ భాగంలో ఉన్న ఒకటి రెండు సీన్స్ తప్ప, మిగతా ఎక్కడా తప్పుబట్టాల్సిన అవసరం లేదని, భయపడుతూనే నవ్వించే పాత్రల్లో కిశోర్, ప్రవీణ్, శంకర్ లు కనిపించారని, ఈ సినిమా హిట్ కొట్టినట్టేనని చెబుతున్నారు.
rajugari gadi-2
nagarjuna
mentalist
samantha

More Telugu News