yogi adithyanath: అక్రమంగా ఉన్న విదేశీయుల లెక్క తేల్చండి.. తరిమేస్తా: సీఎం యోగి ఆదేశం

  • సర్వే చేపట్టి, జాబితా తయారు చేయండి
  • అనుమానితులను తనిఖీలు చేయండి
  • పని చేయని స్టేషన్ ఇన్చార్జీలను ఇంటికి పంపిస్తా
ఉత్తరప్రదేశ్ ను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల లెక్క తేల్చాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. తక్షణమే సర్వే చేపట్టి, జాబితాను తయారు చేయాలని అన్నారు. అక్రమంగా ఉంటున్న విదేశీయులు నేరాలకు పాల్పడుతున్నారని... అలాంటివారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిందేనని చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఉత్తరప్రదేశ్ లోకి చొరబడుతున్న అనుమానితులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తున్న స్టేషన్ ఇన్ ఛార్జులను క్షమించబోనని... అలాంటివాళ్లను ఇంటికి పంపిస్తానని హెచ్చరించారు.
yogi adithyanath
Uttar pradesh cm

More Telugu News