anushka sharma: అనుష్క శర్మను విరాట్ ముద్దుగా ఏమంటాడో తెలుసా?

  • టీవీ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టిన విరాట్‌
  • దీపావ‌ళి సంద‌ర్భంగా ఆమిర్‌, విరాట్‌ల ఇంట‌ర్వ్యూ
  • టీజ‌ర్ విడుద‌ల చేసిన జీ టీవీ
త‌న ప్రేయ‌సి అనుష్క శ‌ర్మ‌ను విరాట్ ముద్దుగా `నుష్కీ` అని పిలుస్తాడు. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్, కెప్టెన్ విరాట్ కోహ్లీల ఇంట‌ర్వ్యూ దీపావ‌ళి ప్ర‌త్యేక కార్య‌క్రమంగా జీ టీవీ ఛాన‌ల్‌లో ప్ర‌సారం కానుంది. ఈ ఇంట‌ర్వ్యూ కోసం అటు క్రికెట్ అభిమానులు, ఇటు సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబ‌ర్ 15న ప్ర‌సారం కానున్న ఈ ఇంట‌ర్వ్యూ టీజ‌ర్‌ను జీ టీవీ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో విడుద‌ల చేసింది.

అనుష్క గురించి మాట్లాడుతూ విరాట్ ఆమెను `నుష్కీ` అని స‌ంబోధించడం చూడొచ్చు. అలాగే విరాట్ భాంగ్రా డ్యాన్స్‌, 28 సెక‌న్ల‌లో ఆమిర్ 'రూబిక్స్ క్యూబ్' ప‌రిష్క‌రించ‌డం టీజ‌ర్‌లో చూడొచ్చు. ఇంకా ఇంట‌ర్వ్యూలో ఏం జ‌రిగిందో తెలుసుకోవాలంటే ఆదివారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఎదురుచూడాల్సిందే!
anushka sharma
virat kohli
aamir khan
interview
nushkie
zee tv
diwali

More Telugu News