nikesha patel: నేను ప్రేమలో పడటమంటూ జరగదు : నికీషా పటేల్

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో 'పులి' సినిమాతో వెండితెరకు నికీషా పటేల్ పరిచయమైంది. ఆ సినిమా పరాజయంపాలు కావడంతో, ఆ తరువాత తెలుగులో ఆమెకి వచ్చిన అవకాశాలు చాలా తక్కువ. అవికూడా ఆశించిన స్థాయి ఆదరణ పొందకపోవడంతో, ఆమె తమిళ .. కన్నడ సినిమాలపై దృష్టిపెట్టింది.

అలాంటి నికీషా పటేల్ దగ్గర లవ్ గురించి ప్రస్తావన తెస్తే, ఆమె తనదైన శైలిలో స్పందించింది. తనకి అసలు ప్రేమ గురించే తెలియదనీ .. ప్రేమ వాసనే పడదని చెప్పింది. ఇంతవరకూ తాను ప్రేమలో పడలేదనీ, ఇక ముందు పడే అవకాశం కూడా ఉండదని అంది. తన జీవితంలో ప్రేమకు స్థానమేలేదనీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరగదని సమాధానమిచ్చింది. ప్రేమ విషయంలో ఈ సుందరి ఇంత నిక్కచ్చిగా మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది .. ఆలోచింపజేస్తోంది.      
Go Back to Shorts
nikesha patel

More Telugu News