chandrababu: దుబాయ్ ఎమిరేట్స్ ప్రతినిధితో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు

  • ఎమిరేట్స్ ప్రతినిధి, సింగపూర్ ప్రతినిధి, పెన్సిల్వేనియా రాయబారితో వీడియో కాన్ఫరెన్స్
  • విమాన సర్వీసుల పెంపు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై చర్చ
  • దుబాయ్ సివిల్ అథారిటీ సీఈవోతో భేటీ కానున్న చంద్రబాబు
దుబాయ్ ఎమిరేట్స్ ప్రతినిధులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో ఎమిరేట్స్ ప్రతినిధి అద్నాన్ ఖాసిం, పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి, సింగపూర్ ప్రతినిధి రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ-దుబాయ్ ల మధ్య విమాన సర్వీసుల పెంపు, విశాఖపట్నం, అమరావతిలలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై చర్చ జరిగింది. మరోవైపు చంద్రబాబు తన యూఏఈ పర్యటనలో దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సీఈవో షేక్ అహ్మద్ బిన్ మక్దూమ్ తో భేటీ కానున్నారు. చంద్రబాబుతో భేటీకి మక్దూమ్ కూడా ఆసక్తిని కనబరిచారు.
chandrababu
ap cm
amaravathi airport
visakhapatnam airport

More Telugu News