subbaraju: ఇంతవరకూ పెళ్లి ఆలోచన రాలేదు .. అందుకే చేసుకోలేదు : సుబ్బరాజు

  • పెళ్లి పట్ల గౌరవం వుంది
  • ఆ దిశగా ఆలోచన చేయను
  • ఇది ఇంతే .. ఇలాగే వుండాలనుకోను
  • ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు 
తాజాగా ఐ డ్రీమ్స్ కి నటుడు సుబ్బరాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇంతవరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణమేమిటనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. 'పెళ్లి' అనే అంశానికి తాను చాలా గౌరవం ఇస్తానని సుబ్బరాజు అన్నాడు. అయితే పెళ్లి జరగడానికి .. చేసుకోవడానికి తేడా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

తనకి పెళ్లి గురించిన ఆలోచన రాలేదనీ, అందుకే చేసుకోలేదని చెప్పాడు. ఇది ఇంతే .. ఇలాగే ఉండాలి .. ఇలాగే జరగాలి అనే ఆలోచనలు తనకి నచ్చవని అన్నాడు. అందరూ పెళ్లి చేసేసుకుంటున్నారు కదా .. మనమూ చేసేసుకుందాం అనే దిశగా తాను ఆలోచన చేయనని చెప్పాడు. అయితే తానసలు పెళ్లే చేసుకోనని ప్రతిజ్ఞ చేయడం లేదనీ, తన మనసు స్పందించిన దానిని బట్టి ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చని అన్నాడు. లవ్ లో తాను విఫలమైనా .. ఇంతవరకూ తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అది కాదని స్పష్టం చేశాడు.  
subbaraju

More Telugu News