ఆడం జంపా: ఒక్కసారిగా రాయిని విసిరారు.. బస్సు అద్దం పగిలిపోయింది: ఆసీస్ ఆటగాడు ఆడం జంపా
- హోటల్కి వెళుతోన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి గువహటిలో చేదు అనుభవం
- భయానక అనుభవం అన్న ఆడం జంపా
- ఆ సమయంలో హెడ్ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నా
- ఇటువంటి భయంకర ఘటనలు మళ్లీ జరగకూడదు
రెండో టీ20 మ్యాచ్ ఆడి ప్రత్యేక బస్సులో హోటల్కి వెళుతోన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి గువహటిలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. గుర్తు తెలియని వ్యక్తి బస్సుపై రాయి విసరడంతో ఆ బస్సు అద్దం పగిలింది. దీనిపై విమర్శలు వస్తోన్న వేళ అక్కడి యువత సారీ కూడా చెబుతోంది. ఈ ఘటనపై స్పందించిన ఆసీస్ అటగాడు ఆడం జంపా తాజాగా మాట్లాడుతూ... ఆ సమయంలో తాను హెడ్ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నానని తెలిపాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని, కొన్ని సెకన్ల పాటు తాము చాలా భయపడ్డామని చెప్పాడు.
ఎవరో రాయి విసిరి ఉంటారని తమ సెక్యూరిటీ గార్డు చెప్పాడని ఆడం జంపా తెలిపాడు. ఇటువంటి భయంకర ఘటనలు మళ్లీ జరగకూడదని అన్నాడు. ఈ ఘటనలో తమకి ఎటువంటి గాయాలు కాలేదని, ఈ ఘటనతో తమ ఆటగాళ్లు ఎవరూ నిరుత్సాహ పడలేదని వ్యాఖ్యానించాడు.