geetamaduri: నందూను మంచి డైరెక్టర్ గా చూడాలని వుంది : గీతామాధురి

  • నటుడిగా నందూ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
  • ఆ దిశగా తనని తాను నిరూపించుకుంటూనే దర్శకత్వంపై దృష్టి పెట్టాలి
  • ఆయన ప్రతిభపై నాకు నమ్మకం వుంది  
గీతామాధురి భర్త నందూ చిన్న సినిమాల్లో హీరోగా చేస్తూనే .. పెద్ద సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారనే ప్రశ్న .. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో గీతామాధురికి ఎదురైంది. నందూ నటుడిగా తనని తాను నిరూపించుకుంటూ ముందుకు వెళుతున్నాడని గీతామాధురి చెప్పింది.

అలా ఆయన నటుడిగా తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే, దర్శకుడు కావడానికి ప్రయత్నించాలని అంది. ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడనీ .. ఆయనలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడనే విషయం తనకి అప్పుడే తెలిసిందని చెప్పింది. అందువలన దర్శకుడిగా ఆయన రాణిస్తాడనే నమ్మకం ఉందనీ, భవిష్యత్తులో ఆయనని ఓ మంచి దర్శకుడిగా చూడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.   
geetamaduri

More Telugu News