mahesh babu: 'భరత్ అను నేను' షూటింగ్ కి రంగం సిద్ధం .. జాయిన్ కానున్న మహేశ్ బాబు

షార్ట్స్‌లో చూడండి
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' షూటింగ్ మొదలై కొంతకాలమైంది. అయితే 'స్పైడర్' ప్రమోషన్స్ విషయంలో మహేశ్ బిజీగా ఉండటం వలన .. ఆ తరువాత ఆయన విదేశాలకి వెళ్లడం వలన ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ నెల 15వ తేదీ నుంచి తాజా షెడ్యూల్ మొదలవుతుందని చెబుతున్నారు. ఆ రోజు నుంచి ఈ సినిమా షూటింగులో మహేశ్ బాబు జాయిన్ కానున్నాడని అంటున్నారు.

ఈ సినిమాలో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫిబ్రవరి నాటికి ఈ సినిమా షూటింగును పూర్తి చేసి, వేసవి సెలవుల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'శ్రీమంతుడు' తరువాత ఆ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.   
Go Back to Shorts
mahesh babu

More Telugu News