జగన్: జగన్ మనస్తత్వం తెలిసిన వారెవరైనా ఆ మాట అనరు: లక్ష్మీపార్వతి

  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి ప్రస్తావన
  • జగన్ ఎలక్షన్స్ కే ఖర్చు పెట్టడని బాధపడుతుంటాం
  • ఓ లక్ష్మీపార్వతి కోసం, ఎన్టీఆర్ కోసం సినిమా తీస్తాడనేది పచ్చి అబద్ధం
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం గురించి దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ మనస్తత్వం తెలిసిన వారెవరూ కూడా ఈ సినిమా జగన్ తీయిస్తున్నాడని అనరు. తెలుగుదేశం పార్టీ కూడా అనలేదు. ఎందుకంటే, ఆ అబ్బాయి ఎలక్షన్స్ కే ఖర్చు పెట్టడని మా పార్టీలో మేమే బాధపడుతుంటాం... అట్లాంటిది, ఓ లక్ష్మీపార్వతి కోసం, ఎన్టీఆర్ కోసం జగన్ మోహన్ రెడ్డి సినిమా తీస్తాడనేది పచ్చి అబద్ధం’ అని ఆమె అన్నారు.
జగన్
లక్ష్మిపార్వతి

More Telugu News