renigunta airport: రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం

  • ప్రయాణికుడి వద్ద 17 రౌండ్ల బుల్లెట్లు
  • స్వాధీనం చేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది
  • పోలీసులకు అప్పగింత
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. రామ్మోహన్ రెడ్డి అనే ప్రయాణికుడి వద్ద నుంచి 17 రౌండ్ల 9ఎంఎం బుల్లెట్లను గుర్తించిన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది... వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మోహన్ రెడ్డిని సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రశ్నించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడు రామ్మోహన్ రెడ్డి తిరుపతి నుంచి హైదరాబాదుకు ట్రూజెట్ విమానంలో వస్తుండగా... అతని వద్ద తూటాలను గుర్తించారు. 
renigunta airport
bullets in renigunta airport

More Telugu News