kathi mahesh: పవన్ ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు : కత్తి మహేశ్

  • పవన్ ఫ్యాన్స్ విషయాన్ని ప్రస్తావించిన కత్తి మహేశ్
  • 'కాటమ రాయుడు' పట్ల అభిప్రాయం చెప్పాను
  • రాజకీయాలకి సంబంధించిన పవన్ పాలసీని అడిగాను
  • భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులు  
తాజాగా కత్తి మహేశ్ ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకి .. పవన్ ఫ్యాన్స్ కి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి ప్రస్తావించారు. 'కాటమరాయుడు' సినిమాను పవన్ చేసి ఉండాల్సింది కాదనీ, అది ఆయనకి ఏ విధంగాను ఉపయోగపడదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశానన్నారు.

 ఇక రాజకీయాల విషయానికొస్తే పవన్ కి తనదైన విధి  విధానాలు ఉండాలనీ, ట్విట్టర్ ద్వారా కాకుండా క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అన్నానని చెప్పారు. పవన్ పాలసీ ఏమిటని ప్రశ్నించడాన్ని ఆయన ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకున్నారనీ .. పవన్ కి వ్యతిరేకవాదిగా చిత్రీకరిస్తూ తనపై దాడులకు దిగుతామంటూ బెదిరించారని అన్నారు. విమర్శకు ప్రతి విమర్శలు చేయడం సరైనదే గానీ .. భౌతికంగా దాడులకు దిగుతామని బెదిరించడం కరెక్ట్ కాదని చెప్పారు. అలా జరిగితే అది అవతలవారికే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందనే విషయాన్ని గ్రహించాలని చెప్పుకొచ్చారు.      
kathi mahesh

More Telugu News