airtel 4g smart phone: జియో ఫోన్ కు షాక్.. దాని కంటే తక్కువ ధరకే ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫోన్

  • రూ. 1399 కే 4జీ స్మార్ట్ ఫోన్
  • కార్బన్ మొబైల్స్ తో భాగస్వామ్యం
  • రూ. 2899 డౌన్ పేమెంట్
జియోకు షాకిచ్చేలా ఎయిర్ టెల్ అతి తక్కువ ధరకే తన 4జీ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించింది. కేవలం రూ. 1399కే 4జీ స్మార్ట్ ఫోన్ ను అందిస్తున్నామని తెలిపింది. కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ ను అందిస్తున్నట్టు పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆధారితంగా వస్తున్న ఈ ఫోన్ లో ఫుల్ టచ్ స్క్రీన్, డ్యూయల్ సిమ్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి ఆప్షన్లు ఉంటాయని తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ పేరును 'కార్బన్ ఏ40'గా నిర్ణయించామని చెప్పింది.

ఈ ఫోన్ కావాలనుకునేవారు ముందుగా రూ. 2899 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫోన్ తో పాటు 36 నెలల పాటు ప్రతి నెలా 169 రూపాయల రీచార్జ్ అవుతుంటుంది. 18 నెలల తర్వాత రూ. 500 రీఫండ్ చేస్తారు. 36 నెలల తర్వాత మరో రూ. 1000 రీఫండ్ చేస్తారు. అంటే, రూ. 1500 క్యాష్ బెనెఫిట్ ఉంటుందన్నమాట. 
airtel 4g smart phone
airtel
carbonn a40

More Telugu News