‘లక్ష్మి`స్ ఎన్టీఆర్’: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో రోజా నటిస్తోందనేది నిజంకాదు!: దర్శకుడు వర్మ
- ఫేస్ బుక్ ద్వారా ఖండించిన వర్మ
- ఈ వార్తలన్నీ నిరాధారం
- ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తలు అసత్యం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ప్రముఖ నటి రోజా నటిస్తుందనే వార్తలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో వర్మ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించారు.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో రోజా నటిస్తోందనే వార్తలు నిరాధారమని, అసత్యమని కొట్టిపారేశారు. ఈ అంశం చుట్టూనే మీడియా వార్తలు తిరుగుతుండటాన్ని ప్రస్తావించారు. కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారనే వదంతులనూ వర్మ ఖండించడం తెలిసిందే.