akash puri: తనయుడి సినిమాను సైలెంట్ గా స్టార్ట్ చేసిన పూరి!

షార్ట్స్‌లో చూడండి
పూరి జగన్నాథ్ .. ఆయన టీమ్ కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో వుంటున్నారు. పూరి తన తనయుడు ఆకాశ్ తో చేయనున్న 'మెహబూబా' సినిమా కోసం లొకేషన్స్ ను సెర్చ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని లొకేషన్స్ ను ఆయన ఎంపిక చేసుకున్నాడని చెప్పుకున్నారు.

అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ రోజే అక్కడ ఆయన ఈ సినిమాను లాంచ్ చేసేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఆయన ఇలా హఠాత్తుగా ఈ సినిమాను లాంచ్ చేయడం విశేషం. ఆకాశ్ .. నేహా శెట్టిపై చిత్రీకరించే ముహూర్తపు సన్నివేశానికి చార్మీ క్లాప్ కొట్టింది. పూరీ కనెక్ట్స్ కి సంబంధించిన వ్యవహారాలను ఆమె చూసుకుంటోన్న సంగతి తెలిసిందే. 'మెహబూబా' సినిమా రెగ్యులర్ షూటింగును కూడా ఈ రోజు నుంచే మొదలెట్టేశారు. పంజాబ్ .. రాజస్థాన్ లలోను కొన్ని షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు. చాలా గ్యాప్ తరువాత సందీప్ చౌతా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.      
Go Back to Shorts
akash puri
neha

More Telugu News